శ్రీ శ్రీరామశరణ్ గురుదేవులు కారణజన్ములు. తన సమస్త జీవితమును శ్రీరామునికే అంకితం చేసారు. శ్రీరామునితో ఐక్యం చెందినవారు. కొన్ని వేల మందిని ప్రభావితం చేసి ఆధ్యాత్మిక మార్గంలోనికి తరలించినవారు. తాను ఆచరించినదే భోధించినవారు. అణువణువులో రామనామ శక్తిని సమ్మిళితం చేసి తన శరీరాన్ని యోగశరీరంగా మార్చుకొన్న మహాయోగి. ప్రేమ, కరుణ తప్ప కఠినత, శత్రుత్వము మచ్చుకైనా కానరాని మహితాత్ములు. శ్రీరామ నామస్మరణతో శ్రీరాముని గుణాలను సొంతం చేసుకొని చిరంజీవిత్వాన్ని సిద్ధింప చేసుకున్న సిద్ధిపురుషులు శ్రీ శ్రీరామ శరణులు. హరినామ స్మరణమే జీవితముగా కలిగియుండిన ఉత్తములు, ఉదాత్తములు, అనుయాయులకు ప్రాతఃస్మరణీయులు శ్రీ శ్రీరామశరణ్ (శ్రీ కుందుర్తి వెంకటనరసయ్య పాకయాజి) గారు.
వారిచే ప్రతిష్టింపబడిన పవనకుమారుని మందిరము బుద్ధాం నందు (కర్లపాల్లెం మండలం,గుంటూరు జిల్లా) భక్తులు కోరిన కోర్కెలు తీర్చుచూ విశేషముగా పూజలు అందుకొనుచున్నారు.
నామప్రయాగ, బుద్ధాం
కర్లపాల్లెం మండలం, గుంటూరు జిల్లా